ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత' - kanna laxminarayana latest news

ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రం నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఆరోపించారు. తెదేపా, వైకాపా రెండూ అవినీతి ప్రభుత్వాలేనని దుయ్యబట్టారు.

kanna

By

Published : Oct 25, 2019, 4:52 PM IST

ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత

ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గాంధీజీ సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన... సామాన్యులకు ఇసుక దొరకడం లేదని, అక్రమంగా రాష్ట్రాలు దాటి పోతోందని ఆరోపించారు. తెదేపా, వైకాపా రెండూ అవినీతి ప్రభుత్వాలేనని, ఏపీ సంక్షేమం భాజపా వల్లే సాధ్యమవుతుందని కన్నా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికను బట్టి పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం స్పందిస్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details