'హోదా ఇస్తేనే ఏపీకి రండి' - bike rally
కర్నూలు జిల్లాలో 'మోదీ గో బ్యాక్' పేరుతో తెదేపా కార్యకర్తలు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ప్రధాని రాష్ట్రాన్ని మోసం చేశారని...హోదా ఇస్తేనే రాష్ట్రంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.
కర్నూలులో మోదీకి వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు మోదీని ఏపీలో అడుగుపెట్టనీయమని తెలుగుదేశం పార్టీ హెచ్చరించింది. కర్నూలులో తెదేపా కార్యాలయం నుంచి 'మోదీ గో బ్యాక్' పేరుతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని రాష్ట్రాన్ని మోసం చేశారని తెదేపా జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వరులు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు భాజపాకు బుద్ది చెప్పాలన్నారు.