ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి అఖిలప్రియను అడ్డుకున్న పోలీసులు!

పరిషత్​ ఎన్నికల సందర్భంగా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తెదేపా ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాచేపల్లి గ్రామానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

By

Published : Apr 8, 2021, 5:34 PM IST

bhuma akhila priya angry on police
bhuma akhila priya angry on police

పరిషత్ ఎన్నికల సందర్భంగా ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ఓ వైద్యుడు వైకాపా తరఫున ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని సమాచారం వచ్చింది. ఈ కారణంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అక్కడికి వెళ్తుండగా పట్టణంలోనే ఆమెను సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రామ్ రెడ్డి తమ సిబ్బందితో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆళ్లగడ్డ పట్టణంలో ఓటరుగా ఉన్న వ్యక్తి బాచేపల్లి గ్రామంలో ఏజెంటుగా ఎలా కూర్చుంటారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు ఒక న్యాయం వైకాపా నాయకులు ఒక న్యాయమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాచుపల్లి గ్రామంలో తనను ప్రభావితం చేస్తున్న వ్యక్తిని వెంటనే అడ్డుకోవాలని లేనిపక్షంలో తాను స్వయంగా అక్కడికి వెళ్లి వైకాపా నాయకులను అడ్డుకుంటానని అన్నారు. సీఐ సుబ్రహ్మణ్యం అఖిలప్రియతో చర్చించి.. ఆమెను వెనక్కు పంపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా అఖిలప్రియ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల అండతోనే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా నాయకులు చూస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details