అమరావతి మార్పుపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. రాజధాని నిర్మాణంపై నీలి నీడలు వచ్చేలా బొత్స వ్యాఖ్యలు ఉన్నాయంటూ... కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన సమావేశంలో విమర్శించారు. రాష్ట్రంలో వరదలు, కరవు పరిస్థితులు నెలకొన్న సమయంలో... ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను బొత్స అవమానించారని... వెంటనే వారికి మంత్రి క్షమాపణ చెప్పాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు.
రాజధానిపై బొత్స వ్యాఖ్యలు సరికాదు: అఖిలప్రియ - అమరావతి మార్పుపై బొత్స వ్యాఖ్యలు సరికాదు: భూమా అఖిలప్రియ
రాజధాని మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సరికాదని... ఆళ్లగడ్డలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. బొత్స వ్యాఖ్యలు దేశమంతా గందరగోళాన్ని కలిగించేలా ఉన్నాయని అభ్యంతరం చెప్పారు.
అమరావతి మార్పుపై బొత్స వ్యాఖ్యలు సరికాదు: భూమా అఖిలప్రియ
TAGGED:
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ