ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారి తప్పి వచ్చింది..మృతి చెందింది! - భల్లూకం

కర్నూలు జిల్లా వెలుగోడులో ఓ ఎలుగుబంటి హల్​చల్​ చేసింది. నల్లమల అటవీప్రాంతం నుంచి దారి తప్పి ఊర్లోకి వచ్చిన మూగజీవం గత రాత్రి చెట్టు ఎక్కింది. ఇవాళ పైపులో దాక్కుని మృతి చెందింది.

bear_roaming_in_velugodu_village

By

Published : Jun 25, 2019, 10:39 PM IST

Updated : Jun 25, 2019, 10:50 PM IST

దారి తప్పి వచ్చింది..మృతి చెందింది!


నల్లమల అటవీప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన ఎలుగు కర్నూలు జిల్లా వెలుగోడులో స్థానిక డిగ్రీ కాలేజీ సమీపంలో తచ్చాడుతూ నిన్న కనిపించింది. జనాల కేకలతో ఎటు వెళ్లాలో పాలుపోక..ఓ చెట్టెక్కి కూర్చుంది. అర్ధరాత్రి సమయంలో చెట్టు దిగి సమీపంలోని పైపులో దూరింది. అటవీశాఖ అధికారులు నిన్నటి నుంచి ఆ మూగజీవాన్ని పట్టుకునేందుకు నానా తంటాలు పడ్డారు. చివరకు ఊపిరాడక మృతి చెందింది.

Last Updated : Jun 25, 2019, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details