కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. సంజీవ నగర్ లో నిర్దాక్షిణ్యంగా పసికందును చెత్తకుప్పలో పడేశారు. పసిబిడ్డను కుక్కలు పీక్కు తినడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు అక్కడికి చేరుకొని పసికందును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి మరణించింది. నవ మాసాలు మోసిన ఆ తల్లి చిన్నారిని చెత్తకుప్పలో పడేయటానికి చేతులు ఎలా వచ్చాయో అని స్థానికులు విమర్శించారు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు చలించిపోయారు.
చెత్త కుప్పలోనే చిట్టి తల్లికి నూరేళ్లు - beetham charla
కన్న తల్లి పెంచడానికి ముఖం చాటేసింది. ఆ చిట్టి తల్లిని కర్కశంగా చెత్త కుప్పకు బలిచేసింది. కన్నపేగును వదులుకోవడానికి ఆ మహా తల్లికి మనసెలా ఒప్పిందో...? చివరకి కుక్కల నోట మాంసం ముక్కలా మారిందా పసికందు.
చెత్త కుప్పలోనే చిట్టి తల్లికి నూరేళ్లు ....