ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నంద్యాలలో దాడులు.. ఇద్దరికి గాయాలు - cricket issue

కర్నూలు జిల్లా నంద్యాలలో వేర్వేరు చోట్ల రెండు దాడులు జరిగాయి. ఒక చోట క్రికెట్ చిచ్చు పెడితే.. ఇంకో చోట అప్పు తీర్చే విషయంలో గొడవ జరిగింది.

క్రికెట్​ కక్షతో కత్తి దూస్తే... అప్పు విషయంలో గాజు సీసాతో కొట్టాడు

By

Published : Aug 13, 2019, 12:08 AM IST

క్రికెట్​ కక్షతో కత్తి దూస్తే... అప్పు విషయంలో గాజు సీసాతో కొట్టాడు

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతంలో వేర్వేరుగా జరిగిన దాడి ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. బాధితులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టెక్కె ప్రాంతానికి చెందిన కాశయ్య అనే యువకుడిని దేవనగర్ ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు దాడి చేసి కత్తితో గాయపరచారు. క్రికెట్ ఆడే విషయంలో జరిగిన గొడవ కత్తి దాడి వరకు తెచ్చింది. నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి దాడి చేసి గాజు సీసాతో గాయపరచారు. తీసుకున్న అప్పు తీర్చడంలో ఈ ఘర్షణ జరిగింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details