కర్నూలులో గంజాయి, ఎల్ఎస్డీ స్టామ్స్ రవాణా చేస్తున్న 10 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గిద్దలూరు, తుని నుంచి గంజాయి, ఎల్ఎస్డీ స్టామ్స్ కొనుగోలు చేశారని సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి తెలిపారు. ఎల్ఎస్డీ స్టామ్స్ పట్టుకోవటం మొదటి సారని తెలిపారు. అది గుర్తుపట్టలేని విధంగా ఉంటుందని ఆమె చెప్పారు.
వాటిని ‘జడ్ఈబీ పే’ యాప్ను ఉపయోగించి ఇండియన్ కరెన్సీని బిట్ కాయిన్గా మార్చి ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు చెప్పారు. నిందితుల నుంచి పదిహేడు కేజీల గంజాయి, 22 మిల్లీ గ్రాముల ఎల్ఎస్డీ స్టామ్స్, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ.4,25,000 ఉంటుందని చెప్పారు.