అర్చకుల ఆవేదన - pujari
కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం అర్చకులు విధులు బహిష్కరించారు. ఈవో సుబ్రమణ్యం పరుష పదజాలంతో దూషించారని ఆవేదన చెందారు. తమ వినతిని అంగీకరించేలేదని వాపోయ్యారు.
విధులు బహిష్కరించిన మహానంది పుణ్యక్షేత్రం అర్చకులు
కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం అర్చకులు విధులు బహిష్కరించారు. ఈవో సుబ్రమణ్యం పరుష పదజాలంతో దూషించారని ఆవేదన చెందారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ ద్వారాలకు మామిడి తోరణాలు, అరటి స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరగా తమ వినతిని అంగీకరించేలేదని వాపోయ్యారు. నిరసన వ్యక్తం చేస్తూ ముఖమండపంలో బైఠాయించారు. ఆలయ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి రాజీ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు.
Last Updated : Mar 2, 2019, 4:16 PM IST