కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కంగాటి శ్రీదేవికి ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది.పుచ్చకాయలమడ గ్రామంలో ఆమె ప్రచారం చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు.తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ...వైకాపానే గెలిపించాలంటూ ఆమె కోరారు.దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబునాయుడు తమ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గ్రామస్థులు తెలిపారు.స్థానికులు నిలదీయటంతో శ్రీదేవి అనుచరులు గ్రామస్థులపైకి దాడికి యత్నించారు.ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.పోలీసులు లాఠీ ఛార్జి చేసి...ఇరు వర్గాలను చెదరగొట్టారు.చేసేదేంలేక...శ్రీదేవి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వైకాపా అభ్యర్థిని నిలదీసిన స్థానికులపై దాడి - ap lections 2019
వైకాపా కార్యకర్తలు గ్రామస్థులపై దాడికి దిగారు. ప్రచారానికి వచ్చిన వారిని ప్రశ్నించడమే వారి నేరమైంది. కర్నూలు జిల్లా పత్తితొండ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి శ్రీదేవి ప్రచారానికి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆమెను నిలదీశారు. అంతే ఆమె అనుచరులు గ్రామస్థులపై దాడికి యత్నించారు.
ycp