"తెదేపా హయాంలోనే యురేనియం తవ్వకాలకు అనుమతి" - allagadda
ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలకు వైకాపా ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే బిజేంద్రా రెడ్డి అన్నారు. తెదేపా హయాంలోనే వీటికి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని స్పష్టం చేశారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలో జరుగుతున్న యురేనియం అన్వేషణను తాము వ్యతిరేకిస్తున్నామని వైకాపా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడారు. యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. 2018లో తెదేపా ప్రభుత్వం హయాంలోనే అనుమతులు వచ్చాయని ఆరోపించారు. అప్పుడు తవ్వకాలకు పచ్చజెండా ఊపిన వారే ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పటం హాస్యాస్పదమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఆళ్లగడ్డ ప్రాంతంలో ఖనిజ అన్వేషణకు విమానాలు, హెలికాఫ్టర్లు తిరిగాయని ఆరోపించారు. అప్పుడు ఏమి చేయలేని తెదేపా నాయకులు ఇప్పుడు యురేనియం తవ్వకాలకు వైకాపానే కారణమంటూ బురద జల్లుతున్నారని విమర్శించారు. యురేనియం కోసం తవ్వకాలు జరుగుతుంటే తప్పక అడ్డుకుంటామని బిజేంద్రా రెడ్డి అన్నారు.