జీఓ నెంబర్ 5ను వెంటనే రద్దు చేయాలి: ఏఐవైఎఫ్ - జీవో నెంబర్ 5
ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్‌ను వెంటనే బర్తరఫ్ చెయ్యలని రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయల ఎదుట ఏఐవైఎఫ్ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
aiyf_protest_againist_appsc
జీఓ నెంబర్ 5ను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జీఓ నెంబర్ 5తో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ జీఓను రద్దు చెయ్యాలని డిమండ్ చేశారు. 36 ప్రశ్నలు తప్పు వచ్చినందున గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 స్క్రీనింగ్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలన్నారు.