అహోబిలం బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించేందుకు వచ్చిన 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్కు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ఘనంగా స్వాగతం పలికారు. అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి శఠారిని ప్రత్యేక పల్లకిలో తీసుకొచ్చి, పీఠాధిపతికి ఆశీర్వాదాలు అందించారు. చెన్నైకి చెందిన వెంకట వరద నాదానందాయ అనే భక్తుడు రూ. 15 లక్షల విలువచేసే స్వర్ణ సింహవాహనాన్ని క్షేత్రానికి బహుమతిగా ఇచ్చారు. ఈ వాహనంపైనే స్వామివారికి సింహవాహన సేవ చేయనున్నారు.
అహోబిలం ఆలయ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - అహోబిలం బ్రహ్మోత్సవాల ఈరోజు స్వామివారి సేవ వార్తలు
సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్న అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలను పర్యవేక్షించేందుకు 46వ పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ గురువారం రాత్రి అహోబిలం చేరుకున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నేడు అంకురార్పణ చేయనున్నారు.
అహోబిలం స్వామివారి బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ