ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధ్యాత్మికతకు... ప్రకృతి రమణీయతకు చిరునామా అహోబిలం

ఓ వైపు భక్తులకు ఆధ్యాత్మికం... మరోవైపు పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తోంది అహోబిలం పుణ్యక్షేత్రం. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో వెలసిన ఈ క్షేత్ర ప్రకృతి రమణీయత చూపరులను ఆకట్టుకుంటోంది. కొండల మధ్య జాలువారుతున్న సెలయేటి అందాలు... పచ్చదనంతో అల్లుకున్న వృక్ష సంపదను మనమూ చూద్దామా...!

By

Published : Oct 29, 2019, 4:11 PM IST

అహోబిలం

భక్తులకు ఆధ్మాత్మికం "అహోబిలం" పర్యాటకులకు ప్రకృతి నిలయం.
కర్నూలు జిల్లా అహోబిలం... భక్తులకు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రసిద్ధ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నల్లమల అడవుల్లో వెలసిన ఈ క్షేత్రం ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంలా నిలుస్తోంది. ఈ ప్రాంతానికి చేరుకునే దారిలో అరుదైన వృక్ష జాతులు, పచ్చని వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

ప్రకృతి అందాలకు నెలవు

పచ్చని చెట్లు, సెలయేళ్లు ఇలా అడుగడుగునా ఇక్కడ సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. ముఖ్యంగా ఎగువ అహోబిలంలో భవనాశి నది ఈ క్షేత్రానికి అదనపు అందాలను తెస్తోంది. వేదాద్రి, గరుడాద్రి అనే కొండల మధ్య ఎగువ అహోబిల క్షేత్రం ఉంది. కొండపై నుంచి జాలువారే జలపాతం, సెలయేటి సవ్వడులు, పక్షుల కిలాకిలా రావాలు, పచ్చని అటవీ అందాలు ఇలా ప్రతిదీ అద్భుతమే.

ABOUT THE AUTHOR

...view details