Kurnool: కర్నూలు జిల్లాలో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో బాగంగా ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ పథకానికి 35వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చే వారికి కాంట్రాక్టు ఇస్తాం.. అజేయ్ జైన్ - Construction of houses in AP
Kurnool: పేదలందరికీ ఇళ్లు పథకంలో బాగంగా ఇళ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కర్నూలులో అన్నారు. ఈ పథకానికి 35వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని సీఎం కోరారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 21లక్షల 30వేల ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 17లక్షల 30వేల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యిందని జైన్ తెలిపారు. ఈ పథకంలో లబ్దిదారులకు ఇల్లు నిర్మాణం కోసం 2లక్షల 15వేల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని అజేయ్ జైన్ చెప్పారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని సిమెంట్, స్టీలు సబ్సిడీ ధరలకు అందిస్తున్నామని అజయ్ జైన్ తెలిపారు.ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ఎవరైనా కాంట్రాక్టర్లు ముందుకు వస్తే, కాంట్రాక్టు ఇస్తామని అజయ్ జైన్ తెలిపారు.
ఇవీ చదవండి: