కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ... ఆదోని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. 22 రోజులుగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న ఆదోని న్యాయవాదులు.. నేడు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి పురపాలక రహదారుల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ ఆదోనిలోనే మొట్టమొదటి ఉద్యమం ప్రారంభించామని తమ డిమాండ్ నెరవేరే వరకు కొనసాగిస్తామని తెలిపారు. ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సభ ప్రాంగాణంలో రాయలసీమ కళాకారులు పాటలు పాడి చైతన్య పరిచారు.
హైకోర్టు ఏర్పాటుకు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ - కర్నూలు న్యాయవాదుల సంఘం
కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆదోని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
హైకోర్టు ఏర్పాటుకు ఆదోని భారీ ర్యాలీ
Last Updated : Oct 28, 2019, 8:34 AM IST