కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 40వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆటో- లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు వెళ్తున్న ఆటో పేరాయిపల్లి సమీపంలో ఆగగా.. వెనకవైపు నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వెంకట సుబ్బమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడినవారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించాలని వైద్యులు సిఫార్సు చేశారు.
ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి - kurnool
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
రోడ్డుప్రమాదం