కర్నూలు జిల్లా దేవనకొండ రహదారిలో కప్పట్రాళ్ల స్టేజీ వద్ద కర్ణాటకకు చెందిన బొలేరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 8మందికి గాయాలయ్యాయి. మృతుడు మాన్వికి చెందిన వినోద్‌గా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కప్పట్రాళ్ల స్టేజీలో రోడ్డు ప్రమాదం - devanakonda
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును బొలేరో వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డవారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం