కర్నూలు అగ్ని మాపక శాఖ కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు చేశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఎన్ఓసీ ఇవ్వడానికి ఫైర్ స్టేషన్ అధికారి నాగరాజు నాయక్ డబ్బులను డిమాండ్ చేశారు. బాధితుడి నుంచి రూ.1.20 లక్షల నగదును తీసుకుంటుండగా అధికారి నాగరాజు, కానిస్టేబుల్ అనిల్‌ను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు.
అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అనిశా దాడులు - కర్నూలు ఫైర్ స్టేషన్ తాజా వార్తలు
అగ్ని మాపక శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న అధికారిని అనిశా అధికారులు పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అగ్ని మాపక శాఖ కార్యాలయంలో అనిశా అధికారులు దాడులు