ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ చెల్లెమ్మ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు?: నారా లోకేశ్‌ - సీఎం జగన్​పై నారా లోకేశ్ విమర్శలు

వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు ఓబులరెడ్డి ఓ మహిళను ఏడాదిగా హింసిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. రౌడీ పాలన కారణంగా ఆమె ఆత్మహత్యకు యత్నించిందని చెప్పారు.

nara lokesh
nara lokesh

By

Published : Nov 11, 2020, 7:00 PM IST

అలీబాబా 40 దొంగల తరహాలో జగన్, వైకాపా ఎమ్మెల్యేలు ప్రజలపై పడి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. రౌడీ పాలన కారణంగా కర్నూలు జిల్లాలో శ్రీలక్ష్మీ దేవి అనే మహిళ ఆత్మహత్యకు యత్నించారని విమర్శించారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఆయన కుమారుడు ఓబులరెడ్డి... నంద్యాలలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ఆమెను ఏడాదిగా హింసిస్తున్నారని ఆరోపించారు.

మహిళల్ని వేధిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై మీ ప్రతాపమా జగన్ రెడ్డి అంటూ ఒక చెల్లెమ్మ ప్రశ్నిస్తున్న దానికి ఏం సమాధానం చెబుతారని లోకేశ్ ప్రశ్నించారు. బాధిత మహిళ వీడియోను లోకేశ్ తన ట్విటర్​లో పోస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details