కర్నూలు స్టాంటన్‌పురంలో ఓ జంట.. వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. వాలంటీర్లమంటూ ఇంటికి వచ్చిన మహిళ, పురుషుడు.. టీకా వేస్తామని వృద్ధురాలిని పరిచయం చేసుకున్నారు. ఇంటి పత్రాలు ఇవ్వాలని అడగ్గా అందుకు ఆమె నిరాకరించింది. ఇద్దరి ప్రవర్తనపై అనుమానం వచ్చి.. వెళ్లిపోవాలని కోరింది. వెంటనే వారు వృద్ధురాలి నోటికి ప్లాస్టర్ వేసి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి.. బంగారు గొలుసు, రెండు గాజులను దోచుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
robbery: టీకా వేస్తామని వృద్ధురాలి ఇంటికి వచ్చి... - Robbery in Kurnool Stantonpuram
తాము వాలంటీర్లమని, టీకా వేయడానికి వచ్చామని చెప్పి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని ఓ జంట మోసగించింది. ఇంటి పత్రాలపై ఆరాతీయటంతో అనుమానం వచ్చిన వృద్ధురాలు వారిని బయటకు వెళ్లమంది. కానీ వారు ఆమెను కట్టేసి బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటన కర్నూలు స్టాంటన్‌పురంలో జరిగింది.
robbery