కర్నూలు జిల్లా తాగునీటి అవసరాల కోసం 900 క్యూసెక్కుల చొప్పున దిగువ కాల్వకు నీరు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ 15 రోజుల క్రితం తుంగభద్ర జలాశయ బోర్డుకు లేఖ రాయగా...ఈ నెల 2న తుంగభద్ర దిగువ కాల్వకు టీబీ డ్యాం ద్వారా అధికారులు నీరు విడుదల చేశారు. ఈ నీరు నేడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన చింతకుంటకు చేరుకుంది. దీంతో స్థానికులు సంతోషంతో ప్రవహించే నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు లేని సమయంలో ఈ నీరు రావడంతో తాగునీటి సమస్య తీరుతుందని గ్రామస్థులు భావిస్తున్నారు.
చింతకుంటకు చేరిన 900 క్యూసెక్కుల నీళ్లు... - కర్నూలు జిల్లా
వర్షాలు లేక ఎండుతున్న గొంతులకు 900 క్యూసెక్కుల నీటిని విడుదలచేయడంతో వారి దాహం తీరుతుంది... దీంతో అక్కడి స్థానికులు సంతోషంతో ఉరకలేస్తున్నారు.
చింతకుంటకు చేరిన 900 క్యూసెక్కుల నీళ్లు...
ఇదీ చూడండి:పోలవరం స్పిల్వే మీదుగా గోదావరి పరవళ్లు