పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య కర్నూలు జిల్లా నందికొట్కూరులో నలుగురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వీరాంజనేయులు (35), వసంత (32) రామలక్ష్మి(7) రాజేష్ (5) రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. బారెడు పొద్దెక్కినా ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు.. లోపలికెళ్లి చూశారు. ఎంత పిలిచినా లోపలి నుంచి ఎలాంటి అలికిడి లేకపోయేసరికి అనుమానపడ్డారు. కిటికీ తీసి చూస్తే... కుటుంబమంతా ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేసుకున్న సీఐ మధుసూదన్ రెడ్డి, ఎస్ ఐ చంద్రశేఖర్ రెడ్డి సంఘట ఇంట్లోకి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ముందుగా పిల్లలకు ఉరివేసి, తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. మృతికి కారణాలపై విచారణ చేస్తున్నారు. ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయా? కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
ఇదీ చదవండి