3 years boy falling in Sambar: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం చోటు చేసుకుంది. ఎర్రకోటకు చెందిన సోమనాథ్ అనే బాలుడు వేడి సాంబారులో పడి మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఎమ్మిగనూరులో తమ బంధువుల ఇంట్లో పూజకు బాలుడిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు వేడి సాంబరులో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటివరకు బుజ్జి మాటలతో అందరినీ సందడి చేసిన బాబు.. ఏడవటం, అందరినీ కలచివేసింది. బాబును బ్రతికుంచుకునేందుకు చికిత్స కోసం కర్నూలుకు తరలించినా.. ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.
కర్నూలు జిల్లాలో విషాదం.. వేడి సాంబారులో పడి బాలుడు మృతి - కర్నూలు జిల్లా
3 years boy death: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు మూడేళ్ల బాలుడు సాంబారులో పడి మృతి చెందాడు. అప్పటివరకు బుడిబడి అడుగులు వేస్తూ.. సందడిగా తిరిగిన బాబు ఒక్కసారిగా ఒళ్లు కాలిపోయి ఏడవటం.. చూపరులను కన్నీరు పెట్టించింది. మూడు రోజుల అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందడంతో కన్నవారి శోకాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు.
వేడి వేడి సాంబారులో పడి బాలుడు మృతి