ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - Telugu latest news

.

ఏపీ ప్రధాన వార్తలు
3PM TOP NEWS

By

Published : Oct 19, 2022, 2:59 PM IST

  • కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర
    Rahul Gandhi Bharat Jodo Yatra: కర్నూలు జిల్లాలో రెండోరోజు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆదోని మండలం చాగి గ్రామం నుంచి ప్రారంభమైన యాత్ర... ఉదయం ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు సాగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Tirumala: ఆ మూడు రోజులు దర్శనాలు రద్దు: తితిదే
    Tirumala Temple To Be Closed Due To Eclipse: తిరుమల శ్రీవారి ఆలయంలో 24న దీపావళి ఆస్థానం,అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్రగ్రహ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల పాటు బ్రేక్ ద‌ర్శనాలను తితిదే రద్దు చేసింది. న‌వంబ‌రు 8న చంద్రగ్రహణం రోజున ఉద‌యం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంట‌ల‌ వరకు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. బ్రేక్ దర్శనం రద్దు చేసినందున 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వివేకా హత్యకేసులో సునీతారెడ్డి పిటిషన్‌పై ముగిసిన వాదనలు
    YS Viveka murder case updates: వివేకా హత్యకేసులో సునీతారెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం శుక్రవారం సవివరమైన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. సునీతా పిటిషన్‌పై గంటకు పైగా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత తరఫు న్యాయవాది కోరారు. హైకోర్టు విశ్రాంత జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు సాగాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కోడుమూరులో ఫ్యాక్షన్ కలకలం... పట్టపగలు కత్తులతో తల నరికిన దుండగులు
    కర్నూలు జిల్లా కోడుమూరులో ఫ్యాక్షన్ కలకలం రేపింది. కేంద్ర మాజీ మంత్రి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్​రెడ్డి ముఖ్య అనుచరుడైన కున్నూరు సిద్దప్పను దుండగులు హత్య చేశారు. కోడుమూరులో తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా దుండగులు కాపుగాచి వేట కొడవళ్లతో విచక్షణారహితంగా వెనకవైపు నుంచి మెడ, తలపై దాడి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కాంగ్రెస్​ అధ్యక్షుడిగా ఖర్గే ఘన విజయం.. ఆ సవాళ్లను అధిగమిస్తారా?
    Mallikarjun Kharge Congress President: సోనియాగాంధీ స్థానంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టబోయేది ఎవరనేది తేలిపోయింది. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే.. ఘన విజయం సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జయకు వైద్యంపై శశికళ కీలక వ్యాఖ్యలు.. దేనికైనా సిద్ధమంటూ...
    తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతిపై సందేహాలు నివృత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్.. తనపై మోపిన అభియోగాలను శశికళ ఖండించారు. జయ వైద్యం విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆమె అన్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు శశికళ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాకిస్థాన్ ఉగ్రవాదికి చైనా వత్తాసు.. భారత్​ ప్రయత్నాలకు అడ్డు
    లష్కరే తొయిబా ఉగ్రవాది షాహిద్‌ మహమూద్‌కు ఐరాసలో చైనా అండదండలు లభిస్తున్నాయి. అతడిపై భారత్‌, అమెరికా ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా నిలిపివేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చిన్న రుణాలకు మళ్లీ గిరాకీ.. త్వరలో 'కొవిడ్‌' ముందు నాటి స్థితి.. బ్యాంకులు రెడీ!
    గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ రుణాలకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు అధికం అవుతున్నాయనడానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు నిపుణులు. అయితే సూక్ష్మ రుణాలకు గిరాకీ పెరుగుతున్నందున, దానికి తగ్గట్లుగా ఎంఎఫ్‌-ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. అధిక మొత్తాలు, ఎక్కువ మందికి రుణాలు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దుమారం రేపిన జైషా వ్యాఖ్యలు.. బెదిరింపులకు దిగిన పాకిస్థాన్
    మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జైషా చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఘాటుగా స్పందించింది. భారత్​లో జరిగే వన్డే ప్రపంచకప్​కు హాజరుకాకూడదనే ప్రతిపాదనను పాక్ బోర్డు పరిశీలిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • NBK107 Update ​: కర్నూలు నడిబొడ్డున బాలయ్య సింహ గర్జన!
    నటసింహ బాలకృష్ణ దూకుడు పెంచారు. బుల్లితెర, వెండితెర అన్న తేడా లేకుండా విశ్వరూపం చూపిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న 'NBK 107' సినిమా నుంచి మరో అప్డేట్​ వచ్చింది. అందేంటో మీరే చూడండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details