ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అపూర్వ సమ్మెళనం... ఆహ్లాదంగా పూర్వ విద్యార్థుల కలయిక - undefined

వారంతా ఒకటో తరగతి నుంచి పది వరకూ కలిసే చదువుకున్నారు. 1995 సంవత్సరం పది పరీక్షలు అయిపోయిన తర్వాత చదవుల కోసం దూరం అయ్యారు. ఇప్పడు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత అందరూ కలిసి గత స్మృతులను నెమరు వేసుకున్నారు.

అపూర్వ సమ్మేళనం

By

Published : Jul 13, 2019, 3:11 PM IST

చదువు కోవడానికే కలిశారు. చదువు కోసమే దూరమయ్యారు. ఎవరి ప్రయాణంలో వారు బిజీ అయిపోయారు. సుధీర్ఘకాలం తర్వాత మళ్లీ కలుసుకున్నారు. విద్యార్థి దశలో చేసిన చిలిపి పనులు నెమరు వేసుకున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేస మండలం పెరవని పాఠశాలలో 1995వ సంవత్సరం పదో తరగతి విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. అప్పడు జరిగిన సంఘటనలు గుర్తుచేసుకొన్నారు. తమను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను సత్కరించి వారి గురు భక్తిని చాటుకున్నారు. అనంతరం తామ చదువుకున్న ఊరిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే సరదాగా గడిపారు. అనంతరం ఒకరి దగ్గరి నుంచి ఒకరు వీడ్కోలు తీసకొని ఎవరింటికి వారు పయనమయ్యారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details