కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ మరో 10 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 184 మందికి కరోనా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనాతో 5 మంది మృతి చెందగా... నలుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మిగిలినవారు కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ కోరారు.
కరోనా కోరల్లో కర్నూలు జిల్లా....కొత్తగా 10 కేసులు
కర్నూలు జిల్లా ప్రజలను కరోనా భయభ్రాంతులకు గురి చేస్తోంది. రాష్ట్రంలో అత్యధిక కేసులు జిల్లాలోనే నమోదయ్యాయి. తాజాగా మరో 10 కేసులు నిర్ధరణ కావటం జిల్లా వాసులను కలవరపాటుకు గురి చేస్తోంది.
10 more corona positive cases reported in kurnool district