ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెుదటిసారి జీరో ఎఫ్ఐఆర్ నమోదు... కానీ...

గన్నవరం పోలీస్ స్టేషన్​లో మెుదటి సారిగా జీరో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. కాగా... ఎవరి ఆచూకీ కోసం ఫిర్యాదు చేశారో... ఆ వ్యక్తి అప్పటికే వీరవల్లి ఠాణా పరిధిలో రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు.

By

Published : Dec 25, 2019, 5:13 PM IST

zero fir filed in gannavarm police station
గన్నవరం పోలీస్ స్టేషన్​లో జీర్ ఎఫ్ఐఆర్

మెుదటిసారి జీరో ఎఫ్ఐఆర్ నమోదు... కానీ...
కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్​లో మెుదటి సారిగా జీరో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. కానీ... ఎవరి ఆచూకీ కోసం ఫిర్యాదు చేశారో... ఆ వ్యక్తి అప్పటికే వీరవల్లి పోలీస్ స్టేషన్​ పరిధిలో రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు.

విశాఖకు చెందిన సూరిశెట్టి భాస్కర్ ఈ నెల 22న స్నేహితులతో కలిసి శబరిమల వెళ్తానని బయలుదేరాడు. విజయవాడ స్టేషన్​లో దిగిపోయి మరో రైలు ఎక్కాడు. భాస్కర్ స్నేహితులు వాళ్ల తల్లి లలితకు ఈ మేరకు సమాచారం అందించారు. భాస్కర్ తల్లి లలిత తమ కుమారుడిని వెతికి పెట్టాలని గన్నవరం పోలీసులను ఆశ్రయించారు.

ఈ నెల 24న ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ అబ్బాయి ముస్తాబాదు రైల్వే గేటు వద్ద ఉన్నాడని లలితకు సమాచారం అందించారు. లలిత తమ బంధువులకు చెప్పటంతో వారు ముస్తాబాదు వెళ్లారు. రైల్వే గేటు వద్ద నుంచి బంధువులు భాస్కర్​ను తీసుకొస్తుండగా వారిని పక్కకు నెట్టి పరారయ్యాడు. దీంతో లలిత విశాఖ నుంచి ఆన్​లైన్​లో గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ భాస్కర్ అప్పటికే వీరవల్లి పోలీస్ స్టేషన్​ పరిధిలో రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు.

ఇదీ చదవండి: చెల్లెలి కాపురం చెదిరిపోయిందని... అన్న ఏంచేశాడో చూడండి!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details