రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న రమేష్‌కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో వైకాపా నేతలపై లేనిపోని ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. సీఎంకు ఫ్యాక్షన్ చరిత్ర ఉందని... మంత్రులు, ఎమ్మెల్యేలను గూండాలుగా లేఖలో పేర్కొన్నారని వ్యాఖ్యానించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని... నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సుధాకర్‌బాబు స్పష్టం చేశారు.
'మాజీ ఎస్ఈసీ రమేష్‌కుమార్ వ్యవహరశైలిపై కోర్టుకు వెళ్తాం' - నిమ్మగడ్డ రమేష్ కుమార్ వార్తుల
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వైకాపా తెలిపింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలో సీఎం సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులను.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీవ్రంగా దూషించారని.. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని వైకాపా ఎమ్మెల్యే టీజెఆర్ సుధాకర్ బాబు తెలిపారు.
ysrcp-mla-sudhakar