YSRCP Leader Rajababu Attack on ST Womens: దొంగతనం చేశారంటూ ముగ్గురు గిరిజన మహిళలపై వైసీపీ నేత దాడి..దళిత సంఘాల ఆగ్రహం YSRCP Leader Rajababu Attack on ST Womens :సందర్భం ఏదైనా ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటామని సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలు పదేపదే ఊదరగొడుతూనే ఉంటారు. కానీ తాజాగా అవనిగడ్డ పరిధిలో దొంగతనం జరిగిందనే ఆరోపణలతో ముగ్గురు అభాగినులపై వైఎస్సార్సీపీ నేత దాడి చేశాడు. రక్తమోడేలా కొట్టినా.. వైఎస్సార్సీపీ నేతకు వంతపాడుతూ మహిళ ఎస్సై వారిని స్టేషన్‌లోనే విచక్షణారహితంగా చితకబాదినా.. పోలీసు ఉన్నతాధికారులు నామామాత్రపు చర్యలతో సరిపెట్టారు.
Mopidevi SI Padma Support to YCP Leaders :మోపిదేవి ఎస్సై పద్మ తన పరిధి దాటి ఎస్టీ మహిళలపై ప్రతాపం చూపించారు. వారిని ఇష్టం వచ్చినట్లు చితకబాదారు. దొంగతనం ఆరోపణలపై బాలిక, ఆమె బంధువులు పద్మ, రమణమ్మలను వైఎస్సార్సీపీ నేత రాజాబాబు ఇంట్లో దారుణంగా హింసించి స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించిన సందర్భంలో.. ఎస్‌ఐ బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. బాధితులు ముగ్గురూ తీవ్ర గాయాలతో, నడవలేని పరిస్థితుల్లో వచ్చినా ఎస్‌ఐ పట్టించుకోలేదు.
YSRCP Leader Attack on ST Womens: చేయని దొంగతనం ఒప్పుకోవాలని.. ఎస్టీ మహిళలపై వైసీపీ నాయకుడు విచక్షణారహితంగా దాడి
Mopidevi SI Padma Attack on ST Women :ఎవరి దాడి చేశారు. ఎలా గాయాలయ్యాయి. అని కనీస వివరాలను బాధితులు నుంచి ఎస్‌ఐ రాబట్టలేదు. పైగా అధికార పార్టీ నేత చెప్పాడని బాధితులను గొడ్డును బాదినట్లు బాదారు. బాధితులు తీవ్ర గాయాలతో ఉన్నా వారికి వైద్యం కూడా చేయించకుండా, రెండు రోజుల పాటు స్టేషన్ చుట్టూ తిప్పారు. స్వయంగా బాధితులే ఈ విషయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రతినిధులకు చెప్పారు.
బాధితులను పరామర్శించిన ఎస్టీ కమిషన్ ఛైర్మన్, సభ్యుడు.. :ఈ దాష్టీకం సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగుచూసినా అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నందున పోలీసులు మూడు రోజులైనా కేసు నమోదు చేయలేదు. మచిలీపట్నం సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల పరామర్శకు ఎస్టీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్, సభ్యుడు శంకర్‌నాయక్ వస్తున్నారన్న తర్వాతే కదలిక వచ్చింది. ఎస్‌ఐ పద్మను సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. ఎస్టీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నిందితుల్లో ఒకరైన గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి స్రవంతిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినా పోలీసులు కఠినంగా వ్యవహరించలేదు.
Attacks on Minorities After YCP Came to Power: మైనారిటీలకు అత్మీయుడినన్నాడు.. కానీ ఇన్ని దారుణాలా.. ఇవన్నీ జగన్‌కి పట్టవా..!
హడావుడిగా మెమో దాఖలు :ప్రధాన నిందితుడు రాజాబాబుపై బెయిలబుల్ సెక్షన్ నమోదు చేయడంతో ఆయన రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించగా పోలీసులు అతడిని వదిలిపెట్టేశారు. ముగ్గురు ఎస్టీ మహిళల పట్ల కిరాతకంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఇంతటి నిర్లక్ష్యం విమర్శలకు తావిస్తోంది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు బుధవారం సాయంత్రం మొవ్వ న్యాయస్థానంలో సెక్షన్ 326ను చేర్చాలని హడావుడిగా మెమో దాఖలు చేశారు.
దళిత సంఘాలు ఆగ్రహం :ఈ కేసులో మహిళా సంరక్షణ కార్యదర్శి స్రవంతి, రాజాబాబు స్నేహితుడు బాబూరావులను కూడా నిందితులుగా చేరుస్తున్నట్లు మంగళవారం రాత్రి అవనిగడ్డ డీఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. వీరిని ఇంత వరకు అరెస్టు చూపించలేదు. వీరికి సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించడం లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
SC ST Commission Chairman visited the woman injured in the YCP leader attack వైసీపీ నేత దాడిలో గాయపడ్డ మహిళలను పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్