ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు' - వైఎస్ జయంతి వేడుకలు

కృష్ణా జిల్లాలో వైకాపా నేతలు వైఎస్ జయంతి నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ysr birth anniversary at krishna district
వైఎస్ జయంతి

By

Published : Jul 8, 2020, 3:24 PM IST

కృష్ణా జిల్లాలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్​రెడ్డి జయంతిని వైకాపా నాయకులు నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో 104 వాహనాలను వైకాపా రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంఛనంగా ప్రారంభించారు. రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని డాక్టర్ దుట్టా రామచంద్ర రావు అన్నారు. వ్యవసాయానికి రాజశేఖర్​రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత సీఎం జగన్ ఇవ్వడం శుభపరిణామమని వల్లభనేని వంశీ అన్నారు.

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్ జయంతి నిర్వహించారు. పేదల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వైఎస్ అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కొనియాడారు.

పామర్రులో ఎమ్మెల్యే అనిల్​కుమార్.. వైఎస్​ఆర్​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ వైఎస్​ఆర్​ అంటూ నినాదాలు చేస్తూ అయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details