వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే ఆయన కుమారుడు జగన్ నడుస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు.
సాంకేతిక లోపాల కారణంగా వాయిదా పడిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15న అమలు చేస్తామని మంత్రి నాని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నేతలు, అభిమానులు పాల్గొన్నారు.