ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు.. పోలీసులకు చిక్కారు

ఒకరు పెయింటర్.. మరొకరు ఎలక్ట్రీషియన్. డబ్బు కోసం అడ్డదార్లు తొక్కారు. మరోఇద్దరితో కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. చివరకి కటకటాలపాలయ్యారు. వీరిలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఉన్నాడు.

By

Published : Jun 19, 2019, 12:06 AM IST

డబ్బుకోసం అడ్డదారులు తొక్కారు... పోలీసులకు చిక్కారు

డబ్బుకోసం అడ్డదారులు తొక్కారు... పోలీసులకు చిక్కారు
విజయవాడ తాడిగడపకు చెందిన తరుణ్, రామానగర్​లు పెయింటర్, ఎలక్ట్రీషియన్​గా జీవనం సాగిస్తున్నారు. గతంలో తాడిగడపలో ఓ లారీ డ్రైవర్​ను బెదిరించి నగదు దోచుకున్నారు. ఈ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారు. శిక్ష అనుభవించిన వారిలో మార్పు రాలేదు. మరో ముగ్గురుతో కలిసి దారి దోపిడీలు చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసుకునేవారు. తాజాగా పెనమలూరు పీఎస్ పరిధిలోని పంటకాలువ రోడ్డులో అర్ధరాత్రి మాటు వేశారు. ఒంటరిగా బైక్​పై వెళుతూ ఫోన్ మాట్లాడేందుకు బాధితుడు వాహనాన్ని ఆపాడు. రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు నిందితులు.. అతన్ని బెదిరించి సెల్ ఫోన్, నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు...నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఇంజనీరింగ్ విద్యార్ది ఉన్నట్లు గుర్తించారు.

నిందితుల నుంచి సెల్ ఫోన్, నగదు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతనేరస్థులు తరుణ్, మణికంఠపై రౌడీ షీట్​లను ఓపెన్ చేస్తున్నట్లు ఇన్​స్పెక్టర్​

ABOUT THE AUTHOR

...view details