పుచ్చకాయలుపైన ఆకుపచ్చరంగు లోపల ఎర్రదనంతో తినేలా చేస్తాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో పసుపురంగులో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రైతు బజారు సమీపంలో రోడ్డు వెంబడి పళ్లు అమ్ముుతున్న వ్యాపారి చెన్నై, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో పండుతున్న ఈ రకం పుచ్చకాయల తీసుకువచ్చి అమ్మకానికి పెట్టాడు. అచ్చు తర్బూజ కాయలా కనిపిస్తున్న ఈ పుచ్చకాయలను వాహనచోదకులను నోరూరించే విధంగా చేస్తున్నాయి. రుచిలో దేశీవాళీ పుచ్చకాయ లాగే ఇది ఉండటంతో స్థానికులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. వీటిని తినేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
నోరూరించే పసుపురంగు పుచ్చకాయలు... - gannavaram
మనం తినే పుచ్చకాయలు లోపల ఎర్రగా పైన ఆకుపచ్చరంగు తో మనకి తారసపడతాయి..ఇందుకు భిన్నంగా పసుపు రంగు పుచ్చకాయలు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇవి ఎక్కడో కాదు..గన్నవరంలోనే...
yellow watermelon at gannavaram