ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బినామీ భూములు లేవని ప్రమాణం చేస్తారా : ఎంపీ విజయసాయిరెడ్డి - తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ

తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ విసిరిన సవాల్​పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తనకు బినామీ భూములు లేవని రామకృష్ణ ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు.

YCP mp vijayasaireddy fire on TDP MLA velagapoodi ramakrishna
బినామీ భూములు లేవని ప్రమాణం చేస్తారా : ఎంపీ విజయసాయిరెడ్డి

By

Published : Dec 24, 2020, 11:03 PM IST

తనకు బినామీ భూములు లేవని వంగవీటి రంగా హత్య కేసు నిందితుడైన వెలగపూడి రామకృష్ణ ప్రమాణం చేస్తారా అని వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బినామీ భూములు లేకపోతే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. ఈ విషయాలన్నింటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

దేవుడి మీద ప్రమాణం చేస్తానని వెలగపూడి రామకృష్ణ సవాల్ విసిరినట్టు మీడియాలో చూశానని అన్నారు. దేవుడంటే ఆయనకు నమ్మకం లేదని, పాప భీతి లేదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details