ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇన్​సైడ్ ట్రేడింగ్ వైకాపాదే.. 6 వేల ఎకరాలు ముందే కొన్నారు'

వైకాపా నేతలు 6 వేల ఎకరాలను ఇన్​సైడ్ ట్రేడింగ్​కు పాల్పడి కొనుగోలు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. రెండు నెలల ముందే వారు ఈ భూములు కొనుగోలు చేశారని అన్నారు.

'YCP leaders were involved in in-house trading' says devineni uma
దేవినేని ఉమ

By

Published : Dec 18, 2019, 11:43 PM IST

మీడియా సమావేశంలో దేవినేని ఉమ

కృష్ణా జిల్లా మైలవరం ప్రాంత అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తెదేపా హయాంలో నియోజకవర్గంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కక్షసాధింపు ధోరణితో నిలిపేశారని ఆరోపించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉల్లి కోసం జనం బారులు తీరి అవస్థలు పడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

ఇన్​సైడర్ ట్రేడింగ్

మధురవాడ, భోగాపురం వద్ద 6వేల ఎకరాలను వైకాపా నేతలు కొనుగోలు చేసి ఇన్​సైడర్​ ట్రేడింగ్​కు పాల్పడ్డారని మాజీ మంత్రి దేవినేని ఆరోపించారు. రిటైర్డ్ ఐఏఎస్ కమిటీ నివేదిక రాకముందే మూడు రాజధానులు ఉంటాయని సీఎం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. తెదేపా హయాంలో రూ. 9 వేల కోట్లకు పైగా అమరావతికి ఖర్చు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందని ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

రాజధానిపై సీఎం యూటర్న్: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details