ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు రాజధాని ప్రాంత వైకాపా నేతల భేటీ - Amaravathi mla met tomarrow

రాజధాని ప్రాంత వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలో భేటీ కానున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం రాజధానిపై ప్రభుత్వ ప్రణాళికలను రైతులకు తెలియజేయనున్నారు.

ycp leaders met tomarrow on capital issue
రాజధాని ప్రాంత వైకాపా ఎమ్మెల్యేల భేటీ

By

Published : Dec 25, 2019, 10:17 PM IST

Updated : Dec 26, 2019, 4:28 AM IST

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న తరుణంలో ఇవాళ రాజధాని ప్రాంత వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. 3 రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనలపై సమావేశంలో చర్చించనున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించటం ద్వారా రైతులకు భరోసా ఇవ్వడమే సమావేశం ముఖ్య ఉద్దేశమని వైకాపా వర్గాలు తెలిపాయి.

Last Updated : Dec 26, 2019, 4:28 AM IST

ABOUT THE AUTHOR

...view details