కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం సానుభూతిపరురాలు జయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వైకాపా నేతల వేధింపులతోనే ఈ ప్రయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె సెక్యురిటీ గార్డుగా పని చేసేది. వైకాపా నాయకుల ఒత్తిడితో రాజీనామా చేసి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. దీనికి సైతం రాజీనామా చేయాలని వైసీపీ నేతలు వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తెదేపా కార్యకర్తలపై అధికార పార్టీ వేధింపులు సరికావని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
తెదేపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం - tdp
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతల వేధింపులతో తెదేపా సానుభూతిపరురాలు జయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన చర్యకు వైకాపానే కారణమని లేఖలో పేర్కొంది.
వైకాపా వేధింపులతో తెదేపా కార్యకర్త ఆత్మహత్యాయత్నం