అరాచకాలకు అడ్డుకట్ట వేయండి:యనమల - fire
మంగళగిరిలో తెదేపా నేత ఉమాయాదవ్ హత్యను తెదేపా మాజీ మంత్రి యనమల ఖండించారు. ఉమాయాదవ్ కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
ex-minister yanama
తెదేపా కార్యకర్తలపై వైకాపా వర్గీయుల దాడులు పెరిగిపోయాయని తెదేపా నేత యనమల మండిపడ్డారు. చినగంజాంలో మత్స్యకార దంపతులపై దాడితో మహిళ ఆత్మహత్యకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేటలో ఎస్సీ వైద్యులపై దాడిచేసి ఆసుపత్రిని ధ్వంసం చేశారన్నారు. వ్యక్తిగత ఆస్తులు, సామాజిక ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని... ప్రభుత్వం వెంటనే స్పందించి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని యనమల కోరారు.