తనకి న్యాయం చేయాలంటూ కృష్ణాజిల్లా గన్నవరంలో ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య నిరాహార దీక్ష చేపట‌్టింది. కిరణ్మయికి బొర్రా సుధీర్ కుమార్తో నాలుగేళ్ల క్రితం జరిగిన వివాహం జరిగింది. పెళ్లైన కొన్నిరోజులకే సుధీర్ కుమార్ ఇటలీకి వెళ్లాడని, కొంతకాలంగా తనని పట్టించుకోవడం లేదని, అధిక కట్నం ఇవ్వాలంటూ తనని వేధిస్తున్నాడని కిరణ్మయి ఆరోపించింది. భర్త కాల్ లిస్ట్ చెక్ చేయగా ఇటలీలో విజయవాడకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది
గన్నవరంలో ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య నిరాహార దీక్ష - గన్నవరం
కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్‌ఆర్‌ఐ భర్త ఇంటి ఎదుట ఓ భార్య ధర్నా చేపట్టింది.తనని వివాహం చేసుకుని ముఖం చాటేశాడని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గన్నవరంలో ఎన్నారై భర్త ఇంటి ముందు భార్య నిరాహార దీక్ష