విజయవాడలో భర్త చేతిలో కిరాతకంగా హత్యకు గురైన మణిక్రాంతి తల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం విజయవాడలో ప్రదీప్ కుమార్ తన భార్యను చంపేశాడు. ఆమె తలను రైవస్ కాల్వలో విసిరేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అతనిచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆమె తల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈరోజు గాలింపు కొనసాగిస్తున్నామనీ.. వలలు, బోట్ల సాయంతో వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.
భర్త చేతిలో హతమైన భార్య తల కోసం గాలింపు - head
విభేదాలతో కిరాతకంగా భార్యను చంపేశాడు. ఆమె తలను మొండెం నుంచి వేరుచేసి కాల్వలో పడేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఇప్పుడు ఆమె తల కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. విజయవాడలో భర్త చేతిలో హత్యకు గురైన భార్య శిరస్సు కోసం పోలీసులు వెతుకుతున్నారు.
భర్త చేతిలో భార్య హతం.. తలకోసం వెతుకులాట