విజయవాడ హత్య కేసులో కాలువలో పారేసిన భార్య తల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. కేసు విచారణలో తల లేకపోయినా ఇబ్బంది లేదని డీఎన్ఏ పరీక్ష ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందని విజయవాడ డీసీపీ సీహెచ్. విజయరావు తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. 2015లో విజయవాడలోని ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థలో ఉద్యోగులుగా పనిచేసిన పేటేటి ప్రదీప్‌కుమార్, సహచర ఉద్యోగి గొప్పిశెట్టి మణిక్రాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2017 నుంచి ప్రదీప్‌కుమార్‌తో విభేదాలతో అతనిపై మణిక్రాంతి సూర్యారావుపేట, మాచవరం, సత్యనారాయణపురం స్టేషన్‌లలో పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది. ఒక కేసులో కోర్టుకు సరిగా హాజరుకానందున నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసి ఈ నెల 6న అరెస్టు చేశారు పోలీసులు. మర్నాడే బెయిల్‌పై బయటకొచ్చి... భార్యతో గొడవకు దిగాడు. అదే రోజు ఆమెను హత్య చేసి దీనికి పరిచయస్తుడైన కారు డ్రైవర్ గరికపాటి భవానీప్రసాద్ సహకరించాడు.
భార్య తల నరికిన నిందితుడికి సహకరించిన వ్యక్తుల అరెస్టు - krishna
విజయవాడలో ఈనెల 11న భార్య తలను కత్తితో నరికిన కేసులో పోలీసులు భర్తతో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
హత్య కేసు