కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెద్ద ముత్తేవిలోని వీఆర్వో అ.ని.శా వలకు చిక్కాడు. గ్రామానికి చెందిన రాంప్రసాద్, నాగబాబు ఇద్దరు అన్నదమ్ములు. వారికి ఉన్న రెండు ఎకరాల యాబై సెంట్లు భూమిపై పాస్ పుస్తకాలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వో అరేపల్లి రవి ఐదువేల నగదు లంచం ఇస్తే పాస్ పుస్తకాలు చేస్తానని చెప్పగా.. అన్నదమ్ములు ఇద్దరు స్పందనలో ఫిర్యాదు చేసారు. ఫిర్యాదుకు స్పందించిన ఏసీబీ ఎస్పీ మహేశ్వరరాజు తన బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా వీఆర్వోని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసునమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని ఎస్పీ తెలిపారు.
అ.ని.శా వలలో వీఆర్వో - ఏసీబీ రైడ్ ఆన్ వీఆర్వో ఇన్ కృష్ణా
'మీ భూమికి నేను పాస్ పుస్తకాలు చేయిస్తాను... కేవలం ఐదువేలు ఇవ్వండి' అంటూ ఓ వీఆర్వో లంచం ఆశించాడు. అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు.
vro arrested by ACB officers rides while taking a bribe at pedda muthevi in krishna