ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పీడ్ బ్రేకర్లకు రంగులు వేసిన స్వచ్ఛంద సంస్థ

విజయవాడలో వేసిన స్పీడ్ బ్రేకర్ లకు రంగులు వేసేందుకు జయహో స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లకు రంగులు వేసి ప్రమాదాల నివారణ కోసం అవగాహన కల్పిస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

By

Published : Jun 10, 2020, 1:05 PM IST

volunteers colored for speed breakers
స్పీడ్ బ్రేకర్లకు రంగులు వేసిన స్వచ్ఛంద సంస్థ

విజయవాడలో ట్రాఫిక్ నియంత్రించేందుకు వేసిన స్పీడ్ బ్రేకర్ లకు రంగులు వేసేందుకు జయహో స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న రాళ్లకు రంగులు లేకపోవడంతో వాహనచోదకులు వేగంగా వెళ్తూ ప్రమాదాల బారిన పడుతుండటం గమనించిన సంస్థ... ఈ కార్యక్రమం చేపట్టిందని జయహో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు జయశ్రీ అన్నారు.

కరోనా నివారణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలతో స్టిక్కర్లను ముద్రించి ప్రజలకు అందిస్తూ కొవిడ్ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.

ఇదీ చదవండి: సచివాలయ ఉద్యోగి అనుమానాస్పద మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details