ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుకున్నది సాధించాడు.... కటకటాలపాలయ్యాడు - REVENGE MURDER

అక్రమసంబంధం కారణంగా మూడేళ్ల కిందట ప్రసాద్ అనే వ్యక్తిని ప్రభాకర్ చంపి రైల్వే పట్టాలపై పడేశారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న బాధితుడి కుమారుడు హత్య చేసిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకున్నాడు.

తండ్రిని చంపిన వ్యక్తిపై ప్రతికారం తీర్చుకున్న కుమారుడు

By

Published : Apr 17, 2019, 10:14 AM IST

కృష్ణాజిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లిలో మూడేళ్ల క్రితం ఓ హత్య జరిగింది. అక్రమ సంబంధం కలిగి ఉన్నాడన్న కోపంతో ప్రసాద్‌ అనే వ్యక్తిని 2016 డిసెంబర్‌లో ప్రభాకర్‌ చంపి రైల్వేపట్టాలపై పడేశాడు. అప్పట్లో సంచలనమైన ఈ కేసును పోలీసులు ఛేదించి... ప్రభాకర్‌ను జైలుకు పంపించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన ఆయన... వేరే గ్రామంలో ప్రశాంతంగా జీవిస్తున్నాడు.
తండ్రి హత్యకు కారణమైన ప్రభాకర్‌పై పగ పెంచుకున్నాడు ప్రసాద్‌ కుమారుడు. సమయం కోసం ఎదురు చూస్తున్న అతను... ఓ పని మీద తన గ్రామానికి వచ్చిన ప్రభాకర్‌పై దాడి చేశాడు. 13 మందితో కలిసి దారుణంగా కొట్టి బండరాయితో మోది హత్య చేశాడు.
జిల్లా వ్యాప్తంగా సంచలనమైన ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. హత్య కేసులో నిందితులందర్నీ అరెస్టు చేశారు. విచారణలో వారు చెప్పే నిజాలు విని ఆశ్చర్యపోయారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

తండ్రిని చంపిన వ్యక్తిపై ప్రతికారం తీర్చుకున్న కుమారుడు

ABOUT THE AUTHOR

...view details