ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాలపై స్పందించకుంటే ఏపీపీఎస్సీని ముట్టడిస్తాం' - appsc latest news

గ్రూప్​-1 మూల్యాంకనం అక్రమాలపై తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాం చినబాబు నేతృత్వంలో అఖిలపక్ష యువజన, విద్యార్థి సంఘాల నాయకులు వర్చువల్ సమావేశం నిర్వహించారు. అక్రమాలపై ప్రభుత్వం స్పందించకుంటే ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

appsc
ఏపీపీఎస్సీ

By

Published : May 26, 2021, 10:32 PM IST

గ్రూప్-1 మూల్యాంకనం అక్రమాలపై ప్రభుత్వం స్పందించకుంటే ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని యువజన సంఘాలు హెచ్చరించాయి. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు నేతృత్వంలో అఖిలపక్ష యువజన, విద్యార్థి సంఘాల నాయకులు వర్చువల్ సమావేశం నిర్వహించారు.

అభ్యర్థులకు తెలియకుండా గ్రూప్-1 ప్రశ్నాపత్రాలను థర్డ్ పార్టీతో మూల్యాంకనం చేయించడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసి ప్రశ్నాపత్రాలను ఆన్​లైన్​లో పెట్టాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బాగాల ఆనంద గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు వేణు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి: కార్మికులు

ABOUT THE AUTHOR

...view details