వైరల్ : మైనర్ ప్రేమికులపై గ్రామపెద్ద జులూం కంప్యూటర్ యుగంలోనూ మూఢ నమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదు. చేతబడి, బాణామతి, కులాచారం, గ్రామ కట్టుబాట్లు అంటూ విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలో...ప్రేమించుకున్నారన్న కారణంగా ఇద్దరు దళిత మైనర్లను పంచాయతీకి పిలిపించి విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలతో కొడుతూ.. కాలితో తన్నుతూ బహిరంగ శిక్ష వేశారు. గ్రామం మొత్తం చూస్తుండగా ఇద్దరు మైనర్లను విపరీతంగా కొట్టారు. కొంతమంది గ్రామస్థులు పంచాయతీ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన.. వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి :