సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం నిలిపివేస్తున్నట్లు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ పైలాస్వామి నాయుడు తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచ హారతులు, నివేదన సమర్పించిన అనంతరం కవాట బంధన కార్యక్రమాన్ని రుత్వికులు నిర్వహిస్తారని చెప్పారు.
రాహుగ్రస్త సూర్యగ్రహణం 21న ఉదయం 10.25 నుంచి మధ్యాహ్నం 1.54 గంటల వరకు ఉన్నందున.. ఆలయంలో జరిగే అన్ని రకాల ఆర్జిత సేవలను, దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తునట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ శుద్ధి చేసి అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, హారతులు ఇచ్చి ఆలయం మూసివేస్తామన్నారు. తిరిగి 22వ తేదీ ఉదయం 6 గంటల నుంచి భక్తులను అనుమతిస్తామని వివరించారు.