వివేకా హత్యలో ప్రమేయం ఉన్న ముగ్గురు ఎవరో... సిట్ లేదా జగన్ సమాధానం చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జగన్ పులివెందుల వెళ్లి ఒక్కసారి వివేకా హత్య గురించి నోరు మెదపలేదని ఆరోపించారు. వివేకా హత్య దర్యాప్తు ఏమైందని స్థానిక పోలీసులను జగన్ అడగకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏం కాపాడుతారని ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె సునీత... జగన్ ను ఎందుకు ప్రశ్నించటం లేదన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయితే...హత్య చేసిన వారిని వదిలేస్తారా అంటూ వర్ల మండిపడ్డారు.
వివేకా హత్యలో... ఆ ముగ్గురెవరు? - undefined
వివేకాహత్య కేసు దర్యాప్తుపై సిట్ సమధానం చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
టీడీపీ నేత వర్ల రామయ్య
TAGGED:
టీడీపీ నేత వర్ల రామయ్య