ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Thotlavallur sand quarries: 'ఇసుక క్వారీలతో వెయ్యి కోట్ల దోపిడీ.. రహదారుల దుస్థితి పట్టించుకోరా..?' - ఇసుక దోపిడీ

Thotlavallur sand quarries: తోట్లవల్లూరు మండలంలో ఇసుక క్వారీల ద్వారా వైసీపీ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల దోపిడీ చేసిందని పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా ఆరోపించారు. టీడీపీ ఆధ్వర్యంలో తోట్లవల్లూరు ఆర్ అండ్ బీ రోడ్డు రోడ్డుపై ఉన్న గోతుల్లో గాలాలతో చేపలు పట్టి, ఈత కొట్టి వినూత్నంగా నిరసన తెలిపారు.

రహదారులపై గుంతల్లో టీడీపీ నిరసన
రహదారులపై గుంతల్లో టీడీపీ నిరసన

By

Published : Jul 30, 2023, 1:13 PM IST

Thotlavallur sand quarries: తోట్లవల్లూరు మండలంలో ఇసుక క్వారీల ద్వారా వైసీపీ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల దోపిడీ చేసిందని పామర్రు నియోజకవర్గతెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజాఆరోపించారు. తోట్లవల్లూరు మండలంలో ప్రధానమైన తోట్లవల్లూరు ఆర్ అండ్ బీ రోడ్డు మొదలు పెట్టి పూర్తి చేయలేకపోవటం ఈ ప్రభుత్వ దివాలా కోరుతనానికి, స్థానిక శాసనసభ్యుడు కైలే అనిల్ కుమార్ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. తోట్లవల్లూరు ఆర్ అండ్ బీ రోడ్డు పూర్తిగా ధ్వంసమై గోతులతో అకాల వర్షాల వలన ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, రోడ్డుపై ఉన్న గోతుల్లో గాలాలతో చేపలు పట్టి, ఈత కొట్టి వినూత్నంగా నిరసన తెలిపారు.

రైతుల నోట్లో మట్టికొట్టారు.. ఈ సందర్భంగా వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ పామర్రు శాసనసభ్యుడు కైలే అనిల్ కుమార్ తోట్లవల్లూరు మండలంలో ఇసుకను విచ్చలవిడిగా దోచుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించారని, వైసీపీ ప్రభుత్వం తోట్లవల్లూరు మండలంలో ఇసుకపై వెయ్యి కోట్లు ఆదాయం పొంది, కనీసం తోట్లవల్లూరు మండలంలోని ప్రధానమైన ఆర్ అండ్ బీ రోడ్లను కూడా వేయలేకపోవడం.. ఈ ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ల ద్వారా ముఠా కార్మికులతో లోడింగ్ చేయించి, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రొక్లెయిన్లతో పెద్ద టిప్పర్లకు లోడింగ్ చేయడం వలన, కార్మికుల పొట్ట కొట్టి చిన్న సన్నకారు రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆవేదన చెందారు. ఈ పాపం వైసీపీ ప్రభుత్వనిది కాదా? అని ప్రశ్నించారు.

మూల్యం చెల్లించుకోక తప్పుదు.. రాబోయే రోజుల్లోకైలే అనిల్ కుమార్ ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని అన్నారు. స్థానిక శాసనసభ్యుడు కైలే అనిల్ కుమార్ కి చిత్తశుద్ధి ఉంటే అసంపూర్తిగా ఉన్న తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు తక్షణమే పూర్తి చేయాలని, అదేవిధంగా వల్లూరు పాలెం నుంచి కంకిపాడు, యాకుమూరు నుంచి ఐలూరు వరకు గల ఆర్ అండ్ బీ రోడ్లను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి తెలుగు రైతు విభాగం మండల అధ్యక్షుడు నక్కలపూడి మురళి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోరిపర్తి గోపయ్య, వల్లూరు రాంబాబు తెలుగుదేశం నాయకులు బొడ్డు సుగుణాకర్ రావు, ఇడుపుగంటి జాన్, ఇడుపుగంటి లక్ష్మి శ్రీ దౌల, గొరిపర్తి శ్రీనివాసరావు, తెలుగు నాని రామకృష్ణారెడ్డి, డొక్కు శివ శంకర్, పాండు రెడ్డి, వీరంకి నాగార్జున, సలాం, వల్లూరు రమేశ్, ఇడుపుగంటి క్రాంతి కుమార్, ఇడుపుగంటి సుధాకర్, వల్లూరు కుమార్, జంపాన సుబ్బారావు, వల్లూరు అశోక్, డొక్కు గోవిందు, గోరిపర్తి సురేష్, చిలినాని తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details